చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో విధ్వంసం

  • ‘ది హండ్రెడ్’ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడి విధ్వంసం
  • క్లిష్ఠ పరిస్థితుల్లో ఉన్న జట్టుని గెలిపించిన పొలార్డ్
  • ఖంగుతున్న రషీద్ ఖాన్
‘ది హండ్రెడ్‌’ టీ20 లీగ్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్‌ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా ఏకంగా 5 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఒక ఓవర్‌లో తాను ఎదుర్కొన్న అన్ని బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి ఆటగాడిగా పొలార్డ్ నిలిచాడు. పొలార్డ్ ఆడిన ఈ సంచలన ఇన్నింగ్స్‌తో ‘ట్రెంట్ రాకెట్స్’పై ‘సదరన్ బ్రేవ్’ జట్టు 2 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది.

తన ఇన్నింగ్స్ ప్రారంభంలో 14 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే రాబట్టి ఇబ్బంది పడ్డట్టుగా పొలార్డ్ కనిపించాడు. ఆ సమయంలో సదరన్ బ్రేవ్ జట్టు గెలుపునకు 20 బంతుల్లో 49 పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్ జారిపోతున్నట్లుగా అనిపించింది. ఆ సమయంలో రషీద్ ఖాన్ తన చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. రషీద్‌పై పొలార్డ్ విరుచుకుపడ్డారు. వరుసగా ఆరు బంతులనూ సిక్సర్లు బాదాడు. దీంతో గెలుపు సమీకరణం 15 బంతుల్లో 19 పరుగులుగా మారిపోయింది. పొలార్డ్ 23 బంతుల్లో 45 పరుగులు బాది ఔటయ్యాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ మిగతా పనిని పూర్తి చేయడంతో సదరన్ బ్రేవ్ జట్టు సునాయాసంగా గెలిచింది.

Kieron Pollard
Rashid Khan
The Hundred
Cricket

More Telugu News